తనువున ప్రాణమై.... - 2

  • 5.2k
  • 2.6k

ఆగమనం....కళ్ళు చిన్నవి చేసి తన అక్కని చూస్తూ... నీకు ఏ పని లేదా అక్క? నామీద నిఘ వేస్తున్నావు. అని రుస రుసలాడుతున్నాడు.ఇంత హడావిడిలో, నీ మీద నేను నిఘా వేయడం. నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, దా.. దా.. వెళ్దాం అర్జెంట్. అని చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది.అక్క ఎక్కడికో చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు. చిన్నపిల్లాడి ని చేసి, నాతో ఆడేసుకుంటున్నావు. ముందు చెప్పు అక్క!! అని విసుక్కుంటూ, చెయ్యి వదిలించుకుంటాడు.అబ్బా ఏంట్రా నీ గొడవ! బట్టల షాపుకి వెళ్తున్నాం. పద, పద కార్ తియ్యి!!బట్టల షాప్ అనేటప్పటికి, కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు అక్కని.బట్టల షాప్ కా! ఇప్పుడా! ఎందుకక్కా?బట్టల షాప్ కి ఎందుకు వెళ్తారు రా?? బట్టలు తెచ్చుకోవడానికి! నిలబడి టైం వేస్ట్ చేయకు, మళ్లీ తొందరగా వచ్చేయాలి రా!! అంటూ, మళ్లీ గుంజుకెళ్ళిపోతుంది.బట్టల షాప్ కి, బట్టల కోసం కాకుండా; బంగారం కోసం