నీడ నిజం - 40

  • 4.3k
  • 1.5k

“ నేను పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను . ...దయచేసి నన్ను ఆపొద్దు . , రాహుల్! విద్యాధరి స్వరం లో చిరాకు, చిరుకోపం, అభ్యర్ధన పోటీపడుతున్నాయి . రాహుల్ నిస్సహాయంగా చూశాడు . “ మీ చిన్నాన్న రహస్యం తెలిస్తే నాన్నమ్మకు ఏదో అవుతుందని కదూ నీ భయం ? ..మరి, తెలియకుండా ఎన్నాళ్ళు దాచి పెడతావ్ ? మీ పిన్ని నన్ను చూడలేదు . ... చూసుంటే ? ఎంత గొడవ జరిగేది ?” రాహుల్ చూపుల్లో మళ్ళీ అదే నిస్సహాయత . “ .... ఎప్పటికైనా నిజం ఆమెకు తెలియాలి . మనం ఆపినా ఆగదు. దాచినా దగదు . ఒక్కసారిగా తెలిసి ఆమె కృం కృం గిపోవటం కంటే ముందుగానే ఆ పరిస్థితికి ఆమెను సిద్ధం చేయటం మంచిది కదా ?”” రాహుల్ కాదనలేక పోయాడు . కానీ, ముందుగా భరత్ రామ్ అనుమతి తీసుకోవాలని