విద్యాదరి రాహుల్ ఇంటికి వచ్చి వారం రోజులైంది . ఈ వారం రోజుల్లో తన అత్తగారికి మరింత చేరువైంది . ఆమెతో అనుబంధం పుర్వజన్మదే అయినా ఆ భావం విద్యాధరి లో లేదు . ఆమె తో ఉన్నప్పుడు విద్యాధరి తన ఉనికి మరిచిపోయి పూర్తిగా కోమలాదేవి లా ప్రవర్తిస్తుంది . ఈ విషయం లో ముసలావిడ ఆశ్చర్యం, ఆనందం అంతా , ఇంతా కాదు. ఇప్పుడు ఆమెకు ఒకే బాధ . కోడలుంది . పెద్ద కొడుకు లేడు . విక్రం సింహ్ ప్రస్తావన వచ్చినప్పుడు ముసలావిడే కాదు , కోమలా దేవి లా స్పందించే విద్యా కూడా ఉదాసీనం గా మారిపోతుంది . కానీ—ముసలావిడకు విక్రం లేని లోటు ప్రత్యక్ష అనుభవం. విద్యాధరి కి ఓ బాధా వీచిక , మధుర స్మృతి . ఒక సాయంకాలం విద్యాలయం రోడ్డు వెంబడి విద్యాధరి , రాహుల్ నడవ సాగారు