నీడ నిజం - 36

  • 4k
  • 1.4k

చిన్నగా దగ్గి సీట్లో సర్దుకుని కూర్చున్నాడు . ఆమెకు తన ఆంతర్యం తెలుసు .అయినా ఇలా అడుగుతుందంటే ఆమె మరేదో ఆశిస్తోంది జాగ్రత్తగా మాట్లాడాలి . “ కోమలా దేవి సహగమనం వెనుక మిస్టరీ ఉన్న మాట నిజం. అందరూ అనుమానిస్తున్నట్లే అది కోమలాదేవి తనకై తాను కోరుకున్న సహగమనం కాదు . మరెవరిదో హస్తముంది . మన:స్ఫూర్తిగా సహగమనానికి పూనుకున్న తర్వాత ఎవరూ కేకలు పెట్టరు . చితిలో నిలువునా కాలిపోతున్నా ఉలకరు, పలకరు .ముఖ్యంగా రాజపుత్ర స్త్రీలు . కోమలా దేవి రాజపుత్ర స్త్రీ కాకపోయినా సంస్కారం లో , సాహసం లో వారికే మాత్రం తీసిపోదు . ఆమె అలా కేకలు పెట్టడానికి ‘ అమ్మా’ అన్న రాహుల్ బాబు పిలుపు కారణం . విక్రం సింహ ఆమెను వివాహం చేసుకుంది రాహుల్ కోసం . ఆ బాధ్యతను కూడా కాదని ఆమె సహగమనానికి సిద్ధపడిందంటే ఆమె