నీడ నిజం - 35

  • 4.1k
  • 1.5k

సహగమనం సాంఘిక దురాచారం అన్న ఒకే ఒక్క ఆయుధం తో వారు అజయ్ పై ప్రత్యక్ష పోరాటం ప్రారంభించారు . అధికార పార్టీ లోని పై వర్గాలు ఈ అవకాశాన్ని పూర్తిస్థాయి లో వినియోగించుకున్నాయి . సమావేశాలతో , ప్రదర్శనలతో అతడి కీర్తిని , పలుకుబడిని దెబ్బ దీశాయి . ఇలా అన్నివిధాల అడకత్తెర లో పోక చెక్క లా నలిగిపోయిన అజయ్ చివరకు భార్య ముందు తలవంచాడు . ఆనాడు జరిగినవన్నీ క్లుప్తంగా చెప్పాడు . అలా చెప్పుకుంటే బార్య దృష్టి లో తనెంత దిగజారి పోతాడో తెలుసు . కానీ—తప్పదు .ఈ మానసిక క్షోభ కన్నా ఆ పతనం మేలు . అజయ్ చెప్పింది మౌనం గా విన్నది . ఆమె మొహం లో కోపం, బాధ, అసలు కనిపించలేదు . నిర్వికార స్థితి . అజయ్ ఆశ్చర్య పోయాడు . “ నన్ను చూస్తుంటే అసహ్యం వేయటం