సుందరవల్లి తన సోదరిలా కాక మనసు కుదిరినప్పుడు తపోధ్యానములో కూర్చునేది . లోక కల్యాణ కారకుడైన నారదమహర్షి తరుణం చూసి శివ తనయుని స్కందగిరి లో దర్శించాడు . నారాయణ పుత్రికల మనో వాంఛితమును షణ్ముఖునికి వివరిస్తాడు . యుక్తవయస్కుడైన కార్తికేయుడు విష్ణుకన్యల రూపురేఖలను, మనసును నారదుని కథనం ద్వారా గ్రహించి వారిని అనుగ్రహించాలని సంకల్పిస్తాడు . పై ఉదంతం శివకేశవుల అభేదాన్ని ఆవిష్కరిస్తుంది . శివశక్తి విష్ణుశక్తి వైపు మొగ్గు చూపటం చాల సహజమైన పరిణామం. ‘ జగతి లో ఏ మహత్కార్యానికైనా శివకేశవులు ఏకం కానిదే పరిపూర్ణ సిద్ధి లభించదు’ పైగా జ్ఞానశక్తికి ఇచ్ఛా క్రియా శక్తులు సోపానములై , సాధనా విశేషములై అలరారుట ఒక ‘ క్రమ పరిణామం.’ ఇదొక సహజగతి ‘ HYPOTHESIS, OBSERVATION, EXPERIMENTATION AND INFLUENCE అనే SCIENTIFIC PROCESS కు ఇదొక ప్రతిరూపం వల్లీ దేవసేనా సమేతుడైన