ఓం శరవణ భవ - 10

  • 2.6k
  • 1.1k

తన మూడవ  మజిలీ లో సుబ్రహ్మణ్యుడు నేటి పంజాబు లోని  భాక్రానంగల్ ప్రాజెక్టు ప్రాంతానికి  వచ్చాడు .  అక్కడొక జన పదం లో  ఓ పుణ్యాత్మురాలి ఇంట పశుల కాపరిగా  చేరాడు . తన పశువులను మేపినందుకు   ఆ స్త్రీ ప్రతిఫలంగా  రెండు పూటలా గోధుమ రొట్టెలను  స్వామికి సమర్పించుకునేది .  ‘ బాలక్  నాధ్ ‘ నామధేయం తో  కుమారస్వామి పామరుని భంగి  పశు సంరక్షణలో  లీనమైపోయాడు .  విశుద్ధ జ్ఞాన స్వరూపునకు  ఈ విచిత్ర వేషమేమిటి ?  జగత్పతి పుత్రుడు జానపదుడు  కావటం కేవలం  ఈశ్వర సంకల్పమే కదా  !   బాలక్ నాధ్  రోజూ పశువులను  అటవీ ప్రాంతానికి తీసుకెళ్లేవారు .  కానీ, పశువులు  అడవిలో పచ్చిక  మేసే  వి కావు .  బాలక్ నాధ్  వాటిని  ఒక రక్షణ వలయం లో  ఉంచి  తను  చెంతనున్న  గుహలో  తపో సమాధి లో  ఉండిపోయేవాడు .  ఇలా కొంతకాలం