నీడ నిజం - 28

  • 3.7k
  • 1.6k

గిరిధర్ లాల్ జైపూర్ లో వెదకని లాడ్జంటూ లేదు . చిన్న చితక మొదలుకొని అయిదు నక్షత్రాల స్థాయి వరకు జల్లెడ పట్టేశాడు . ఎక్కడా విద్యాధరి వివరాలు ఆవగింజంత కూడా దొరకలేదు . అతడికి ఈ పని అప్పగించింది రూపాదేవి . అజయ్ కు చెప్పలేదు . “భర్తకు తెలియకుండా మొదట తనే విద్యాదరి ని కలవాలి . మిస్టరీ తెలుసుకోవాలి .” ఆమె ఆలోచన. అసైన్మెంట్ ఒప్పుకున్నాక గిరిధర్ మొదట విద్యాదరి టీం వివరాల కోసం గ్రామం లో వాకబు చేశాడు . ఒక అవగాహన కు వచ్చాడు . మిగతా పట్టణాలు , నగరాల తో పోల్చుకుంటే అజయ్ సింహ్ గ్రామం జైపూర్ కే కాస్త దగ్గర . పైగా సాగర్ స్థాయి వ్యక్తులు సాధారణం గా తమ విడిదికి జైపూర్ నే prefer చేస్తారు . అందుకే గిరిధర్ తన పరిశోధన జైపూర్ తో ప్రారంభించాడు