సా గర్ అసహనం, కోపం తెలుసు గనుక విద్యా తను లాడ్జ్ లో డైరీ మరిచి పోయినట్లు అతడి తో చెప్పలేదు . సాగర్ కూడా ఆ విషయం తెలీనట్లే ఉన్నాడు . రాహుల్ ఫోన్ చేసినట్లు చెప్పలేదు . తన సహజావేశం తో విద్యాను నిలదీయ లేదు . డైరీ వెలుగు లోకి వస్తే రాహుల్ ప్రసక్తి వస్తుంది . రాహుల్ ‘అమ్మ’ సెంటిమెంట్ తో విద్యాను కదిలిస్తాడని సాగర్ భయం . పూర్వ జన్మ బంధాలు విద్యా జీవితాన్ని , ప్రశాంతతను కలవర పెట్టడం సాగర్ కు ససేమిరా ఇష్టం లేదు . కానీ---రాహుల్ , జస్వంత్ రాక తో అతడు ఉలిక్కి పడ్డాడు . వాళ్ళను కూల్ గా రిసీవ్ చేసుకున్నాడు . పైగా విద్యధరి గారి డైరీ రిసీ వ్ చేసుకున్నాడు . ఇంటి గుమ్మం తొక్కిన వారిని గెంటి వే య లేడుగా. “