ఉన్నదీ ఒక్కటే జిందగీ

  • 7.1k
  • 2.6k

కైలాష్ , కొండపై నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చాలా ఎత్తైన కొండ పైకి ఎక్కుతాడు .మరో పది అడుగులు వేస్తే దూకుతాడు అనగా ఏదో కాలికి తగులుతుంది. అది మెరిసే ఒక రాయి. పక్కనే ఉన్న ఒక కర్ర సహాయంతో ఆ రాయిని భూమి నుంచి బయటికి తీస్తాడు . దాని దుమ్ముని తుడుద్దామని చేతితో అలా అనగానే ,అతని స్పర్శ కారణంగా ఒక ఆత్మ బయటకు వస్తుంది. నిజానికి అది వేరొకరి ఆత్మ . దాన్ని చూడగానే దయ్యంలాగా అనిపించి భయపడిపోతాడు. కానీ ఎలాగో చావాలి అనుకున్నప్పుడు ఎలా చస్తే ఏంటి లే ? అనుకొని ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు. “ నేనొక భూతాన్ని! ” అంటూ కొంచెం భయంకరంగా చెబుతోంది . “ వామ్మో సినిమాల్లో చూపించినట్టు మమ్మల్ని చంపకు తింటావా? ” “ నాకు అంత సీన్ లేదులే , ఏదో