మహారాణి సీతాదేవి

  • 5.8k
  • 2k

ముగ్ధమనోహర రూపం.. సుందరమైన, సుసంపన్నమైన జీవితం.. విలాసవంతమైన జీవన విధానం ఈమె సొంతం. పూర్వాచార సంరక్షణలో భాగంగా సాంప్రదాయాలకు కట్టుబడి కట్టూ బొట్టులో నిండుగా, హుందాగా కనిపించే మహారాణులతో పోల్చితే ఈమెది ఎంతో భిన్నమైన జీవితం. ఆధునిక మహిళగా, ఆ కాలపు మహారాణిగా ఈమె జీవన శైలి అనన్య సామాన్యమైనది. అందికే ఈ మహారాణిని " ఇండియన్‌ వాలీ సింప్సన్ " గా కొనియాడారు. ఆమే పిఠాపురం మహారాజకుమారి సీతాదేవి.. మన తెలుగింటి ఆడబిడ్డ. విధి ఆడే నాటకం ఎంత వింతగా ఉంటుందో! మహారాజకుమారి సీతాదేవి అందుకు అతీతం ఏమీ కాలేదు. పిఠాపురం చివరి సంస్థానాధీశుడు మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్, రాణి చిన్నమాంబాదేవి (మీర్జాపురం వారసురాలు)ల మూడో కూతురు సీతాదేవి. ఈమె 1917 మే 12న మద్రాసు అళ్వార్ పేటలోని మహారాజా సూర్యారావు రోడ్డు ముర్రేస్ గేట్ దగ్గరున్న డన్మోర్ హౌజ్‌లో జన్మించారు. 1935 వరకూ