జతగా నాతో నిన్నే - 29

  • 4.7k
  • 2.2k

మరోవైపు అన్వి కోసం వెతుక్కుంటూ వెళ్లిన అభయ్ దిక్కులాన్ని పరికించి పరికించి చూసాడు. కానీ తనకి ఎక్కడ అన్వి జాడ కనిపించలేదు . “ బహుశా నేను దురదృష్టవంతుడిని అనుకుంటా!. నా ప్రేమను తెలియజేసే అదృష్టం నాకు ఉండదనుకుంటా . నేను ప్రేమని తెలియజేస్తాను అని చెప్పడం వల్లే , తనకి ఇలా అయ్యి ఉంటుందా ?” అని ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే, అక్కడ ప్రతిక్షణం తనకి ఒక నరకమే! త్వరగా కనుక్కోవాలి అంటూ వెతుకుతూ అటు పక్క ఉన్న నగరాన్ని అంతా చూసాడు .కానీ తనకి అన్వి ఎక్కడ కనిపించలేదు. అప్పుడే తనకి ఎత్తుగా ఉండే ఒక టవర్ కనిపించింది. చుట్టూ అంత గమనించాడు. ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాతే , ఒక్కసారిగా తన తెల్లని రెక్కలని విప్పి ఆకాశంలోకి ఎగిరాడు అభయ్. అలా ఎగురుతూ వెళుతున్నప్పుడే అటుగా ఏదో పని పైకి వచ్చినా భూషణ్ కంటికి