జతగా నాతో నిన్నే - 28

  • 4.3k
  • 2k

అలా రోడ్డుపై ఆలోచించుకుంటూ వస్తున్న రాహుల్ కంటికి దూరంగా ఏదో కనబడింది .దాన్ని చూడగానే అతడి అడుగుల వేగం పెరిగింది. దాని సమీపించే కొద్దీ అది ఏంటో అర్థం అయ్యి అప్రయత్నంగానే బాధగా “ స్నూపీ .........” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు . దాన్ని చేరుకుని దాని చేతిలోకి తీసుకోగానే, దానికి ఉన్న రక్తం అంతా అతడి శరీరాన్ని తడిపేసింది. “ స్నూఫీ ఎవరు నిన్ను ఇలా చేసింది ?” అంటూ ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయాడు . రోడ్డు పైన అన్విని వెతుక్కుంటూ వస్తున్న అభయ్కి దూరంగా రాహుల్ కనిపించేసరికి , పరుగు పరుగున తన దగ్గరికి చేరుకున్నాడు. రాహుల్ చేతులో కుక్క పిల్లని చూడగానే , “ రాహుల్ అన్వి ఎక్కడ ? ” అన్నాడు భయంగా. అప్పటిదాకా ఏడుస్తున్న రాహుల్ తేరుకొని, “ అన్వి ఎక్కడ ?” అంటూ తిరిగి ప్రశ్నించాడు. “ ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు.