జతగా నాతో నిన్నే - 27

  • 4.3k
  • 1
  • 2.1k

కుక్క పిల్లతో చాలా సంతోషంగా ఆడుకుంటున్న అన్విని చూడగానే రాహుల్ మనసులో కలుకుమంది. “ అసలు ఎలా ఉండగలుగుతున్నావు అన్వి. కన్న వాళ్ళని పోగొట్టుకున్న నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావో నేను ఊహించగలను . అసలు ఈ విషయం మీ ఫ్రెండ్స్ కి అయినా తెలుసా లేదా? ” అంటూ ప్రేమగా తన వైపు చూస్తూ ఉన్నాడు. అలా తన వైపు చూస్తూ ఉండగానే కళ్ళల్లో నీళ్లు గ్రావిటీకి కిందికి దూకుతానన్నట్టు మోరాయిస్తున్నాయి. “ ఏంటో నేను ఒక డ్రాకులా అన్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. మనుషుల్లాగా ఈ మధ్య మారిపోతున్నానని భయమేస్తుంది ” అంటూ తలతిప్పి కన్నీళ్ళను తుడుచుకున్నాడు రాహుల్ . నేను ఎలాగైనా అన్వి యొక్క అసలు నిజాన్ని తెలుసుకుని తీరాలి . నాకు తెలిసి ఈ విషయాన్ని తన స్నేహితులకు కూడా చెప్పిండదు . కాబట్టి మళ్లీ వెళ్లి ఆ తోటమాలిని అడగాలి అని