జతగా నాతో నిన్నే - 24

  • 4.2k
  • 1.9k

అభయ్ ఫెయిల్ అయ్యాడు అని తెలియగానే రాహుల్ కూడా ఎందుకో చాలా బాధపడతాడు. మిగిలిన వారి సంగతి చెప్పనక్కర్లేదు . ఎంతైనా మన తోటి వారు మనలాగే సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. వాళ్లకి చిన్న కష్టం వచ్చినా మన కష్టంగానే భావించమని తత్వాలు చాలామందికి ఉంటాయి. ఇన్ని రోజులు వాళ్ళని నవ్విస్తూ .....కష్టాల్ని పంచుకున్న అభయ్ ఒక్కడికి మాత్రమే అలా అవ్వడంతో అందరూ నిరాశగానే ఉన్నారు . దాంతో వాళ్ళ స్థాపించిన ఆర్గనైజేషన్ ని కొన్ని రోజులు నడపకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు కూడా రాహుల్ నిరాశగానే కాలేజీకి వచ్చాడు. కానీ అమ్మాయిలు చూపు మాత్రం తన నుంచి దూరంగా వెళ్లలేదు . వాళ్ళకి పాస్ హా? ఫెయిలా ? అని కాదు , అబ్బాయి ఎలా ఉన్నాడు అన్నదే ముఖ్యం . ఆ విషయం కొంచెం ఉపశమనం కలిగించిన, మనసు మాత్రం మొండిగా ప్రవర్తిస్తూ ఉంది