జతగా నాతో నిన్నే - 22

  • 4k
  • 1.9k

లేత సూర్యకిరణాలు పగిలిపోయిన టెర్రస్ ఖాళీ ప్రదేశం నుండి వాళ్ళ పైన పడ్డాయి . దాంతో మేల్కొన్న అన్వి, రాహుల్ ఒడిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది . నెమ్మది నెమ్మదిగా తనకి రాత్రి జరిగిన విషయాలన్నీ కళ్ళ ముందు కదిలాయి. దాంతో బాధగా ముఖం పెట్టి , తన బ్యాక్ తీసుకుని ఏడుస్తూనే పక్కకు నడిచింది . తను లేచిన చప్పుడికి మేలుకున్న రాహుల్ ,ఏం మాట్లాడకుండా తననే చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి “ అన్వి........” అంటూ చిన్నగా పలకరించాడు రాహుల్. “ రాహుల్ చాలా థాంక్స్!. ఇన్ని రోజులుగా నాలో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు. ఇప్పుడు నీవల్ల అది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బహుశా నా బాధ కారణంగానే అనుకుంటా ,ఇంకా నా కళ్ళముందే అమ్మానాన్నలు ఉన్నారు అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన ఓదార్పుతో ఇకనైనా ఈ నిజాన్ని గ్రహిస్తాను ” అంటూ కంటి పైన ఉన్న