జతగా నాతో నిన్నే - 21

  • 4.1k
  • 2k

“ అయినా భూమి పైన మొక్కలు నాటడం పెద్ద విషయమేం కాదు కదా? ఎందుకు దీనికి అంత సీన్ చేస్తున్నారు . నేను ఇక్కడికి వచ్చింది అమ్మని చూడడానికి , ఎందుకు ఇంకా ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచించడం ? చిల్ మామ చిల్ ” అంటూ ఎగురుతూ వెళ్ళిపోయాడు అభయ్. కొంత దూరం వెళ్ళాక “ ఛీ నేనేంటి ? మనిషి లాగా మారిపోతున్నాను . కొన్ని రోజులు వాళ్ళతో ఉండేసరికి వాళ్ళలా ప్రవర్తిస్తున్నాను ” అని వోళ్ళంతా జలదరిస్తుండటంతో సద్దుమనీగాడు. కొంతసేపటికి తన ఇంటిని చేరుకున్న అభయ్ తన కుటుంబంతో చాలా సంతోషంగా గడిపాడు. భూమి పైన జరిగిన ఒక్కొక్క విషయాన్ని తనకు వచ్చిన ఆ చివరి మిషన్ గురించి చెప్పాడు . తను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ......వాళ్ళ అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నాడు. చివరిగా ఒకసారి తన మిత్రులందరికీ చూసి మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో?