జతగా నాతో నిన్నే - 19

  • 3.7k
  • 1.9k

ఒకరినొకరు చూసుకుని ఇద్దరు షాక్ అవుతారు. కానీ మరే మాట్లాడుకోరు . రాహుల్ గదిలోకి వెళ్లడానికి దారి వదులుతాడు అభయ్. “ సరే బాబు గదిని ఏం పాడు చేయకుండా శుభ్రంగా ఉంచుకోండి ” అంటూ చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతాడు . రాహుల్ ని పలకరిద్దాం అనుకుంటున్నాడు .కానీ తను ఏమి పలకరించకుండా అలాగే కాసేపు బెడ్ పై కూర్చుంటాడు . తన వస్తువులన్నీ సర్దుకున్న తర్వాత ఎక్కడ కూర్చోవాలో అర్థం కాదు రాహుల్ కి. అందుకే మౌనంగా ప్రశ్నార్థకంగా ,అభయ్ వైపు చూస్తాడు . అభయ్ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా లేచి తన బెడ్ని ఒకపక్కగా లాగుతాడు . అంతే! రెండు అటాచ్డ్ బెడ్లు విడిపోతాయి . రాహుల్ తన బెడ్ ని తనువైపుగా లాక్కొని కాసేపు పడుకుంటాడు . “ రాహుల్ నాకు కొంచెం పని ఉంది. నేను వెళ్తున్నాను డోర్ లాక్ చేసుకో ”