ఆ మరుసటి రోజు కాలేజీకి రాహుల్ వచ్చాడు. అప్పుడే కాలేజీకి వచ్చిన అన్వి, తనని చూసింది . “ ఏయ్ .....రాహుల్ ” అంటూ అరుస్తూ తన దగ్గరికి వచ్చింది. ఏంటి అన్నట్టు కళ్ళతోనే చూశాడు. “ నిన్ను ఎందుకు నువ్వు ప్రోగ్రాంలో ఉండలేదు. అంత తొందరగా వెళ్ళిపోయావు ఏంటి? ” అంటూ ఆయాసంగా శ్వాస తీసుకుంటూ పలికింది. “ లేదు. కొంచెం హెల్త్ బాగోలేదు. అందుకే తొందరగా వెళ్ళిపోయాను ” ఏదో చెప్పి కవర్ చేశాడు. “ అవునా! ఇదిగో మన ప్రోగ్రాం ఫస్ట్ వచ్చింది. అందులో నీ వాటా డబ్బులు ” అంటూ చేతిలో పెట్టబోయింది. “ పర్వాలేదు. నీకే అవసరాలు ఉంటాయి, తీసుకో!” అంటూ చెప్పి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు వచ్చేశాడు . “ నాకు చాలా సహాయము చేశావు. ప్లీస్ ఈ ఒక్కసారికి తీసుకో ” అంటూ అతడి ప్రమేయం లేకుండ చోక్క జేబులో