జతగా నాతో నిన్నే - 08

  • 4.6k
  • 2.5k

“ అబ్బా నా చివరి మెషిన్ మామూలుగా ఉంటుందనుకుంటే , ఇంత కష్టంగా ఉంది ఏంటి? ముందే నా పైన తనకి మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు తనతో ఎలా మాట్లాడాలి ” అంటూ ఆలోచించసాగాడు అభయ్. అభయ్ అలా ఆ రాత్రంతా గడిపేసాడు . మరునాడు తనతో ఎలాగైనా సరే మాట్లాడాలని , తనకి ఎలాగైనా సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆరోజు అందరికంటే ముందు కాలేజీకి వెళ్లిన అతడు అన్వి పాప కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా అభయ్ ఒకరి కోసం ఎదురు చూడటంతో మిగిలిన వాళ్లంతా చాలా ఆత్రుతగా తన దగ్గరికి వెళ్లి ,మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఏం పట్టించుకోకుండా నిశ్శబ్దంగా అన్నాడు. అతడేదో పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు కొన్ని క్షణాల్లోనే కాలేజీకి వచ్చిన అమ్మాయిలంతా తనని చుట్టుముట్టేశారు . “ గీవ్ మీ ఫ్రీడం .ప్లీజ్ గో నౌ ” అంటూ కాస్త అరిచాడు