జతగా నాతో నిన్నే - 07

  • 4.6k
  • 2.7k

ఆరోజు జరిగిన సంఘటన గురించి రూముకు వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంది అన్వి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు ? ఆరోజు కూడా అంతే, అలా వచ్చి ఇలా రక్షించేసి వెళ్లిపోయాడు . మళ్ళీ అలాగే ఈరోజు కూడా జరిగింది. ఆ అబ్బాయికి నేను ప్రమాదంలో ఉంటే ముందే ఎలా తెలిసిపోతుంది ? నాకు ప్రమాదం అని తెలిస్తే చాలు ,అడ్డుగా వచ్చి రక్షిస్తున్నాడు. నాకు ఆ అబ్బాయికి మధ్య ఏదైనా బలమైన బంధం ఉందా? మేం పదే పదే కలుస్తున్నాము ఏలాగా? అంటూ ఆలోచిస్తూ తన జుట్టుతో ముంగురులు తిప్పుతూ ఆడుకుంటుంది అన్వి. “ ఏంటి మేడం ,తేగ ఆలోచిస్తున్నారు ” అంటూ పక్కగా వచ్చి కూర్చుంది డిటెక్టివ్ గీత . “ ఏం లేదు మామూలుగానే ఉన్న ” అంటూ అసలు విషయం దాచేస్తూ తిరిగి పడుకుంది. “ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, మాకు బాగా