మనసు చెదిరినట్లు నటించిన మహాదేవుడు లిప్తకాలం మూడో నేత్రం కొద్దిగా తెరిచి మన్మధుని వైపు దృష్టి సారించాడు . ఆ స్వల్ప వీక్షణానికే సుమశరుడు భస్మావశిష్టమైపోయాడు . ఈ ఘోరానికి తల్లడిల్లిపోయింది రతీదేవి శంకరుని పాదాలపై పడి పతి భిక్ష ప్రసాదించమని వేడుకుంటుంది . కరుణించిన కైలాసపతి కన్నులు తెరిచి , ఇదంతా తన లీలా విశేషమని , ‘శుభ తరుణం’ సమీపించగానే మన్మధుడు పునర్జన్మ పొందగలడని ఊరడించి పంపుతాడు . తిరోగమించిన సుమశరం హిమాలయము చేరి హైమావతి ఎదలో సున్నితం గా నాటుకుంటుంది . తత్ఫలితంగా ఆమె లో భావసంచలనం కలుగుతుంది . మధుర భావనలతో ఆమె ఏకాగ్రత కోల్పోతుంది . ఈ పరివర్తనమునకు కారణమేమిటో