ఓం శరవణ భవ - 4

  • 4.8k
  • 2.2k

సోదర త్రయం లో  రెండవవాడైన   సింహ ముఖుడు  అసురుడైననూ సర్వశాస్త్రములు  తెలిసిన  వివేకి .  సహజమగు  అసుర స్వభావం తో నాశము కోరి  తెచ్చుకుంటున్న  అన్నగారిని వరించ తన వంతు ప్రయత్నం చేస్తాడు .  కానీ, ఫలితం శూన్యం .  శూర పద్ముని  పట్టుదల, పంతం యుద్ధానికే  దారితీశాయి .  శూర పద్ముని  మంత్రాంగం, మనోభీష్టం  నారదమహర్షి సమయస్ఫూర్తి , సరస సంభాషణతో  మరింత దృఢమవుతుంది .  దేవతలపై , దండయాత్ర చేయాలనీ  రాక్షసకోటి  తీర్మానిస్తుంది .  శూర పద్ముడు  అశేష సేన వాహిని తో  అలకాపురిపై  దాడి చేస్తాడు .  ఎలాంటి  ప్రతిఘటన లేకుండా  కుబేరుడు  శూర పద్ముడికి  లొంగి పోతాడు .  కానుకలు సమర్పించి  రాక్షసపతిని  ప్రసన్నం చేసుకుంటాడు .        సునాయాస విజయం తో  విజృంభించిన  శూర పద్ముడు అమరావతి పై  దడి చేస్తాడు .  అతడి ధాటికి నిలువలేని  సురాధిపతి  ఆకాశమార్గాన పారిపోతాడు .  దానవేంద్రుడు