ఓం శరవణ భవ - 3

  • 5.4k
  • 2.5k

మహా పరివర్తనమునకు  సమయం సమీపించింది .   ఓంకార స్వరూపుడైన కుమారుడు ప్రభవించే శుభ తరుణం అతి చేరువలోనే ఉంది .  సమున్నత హిమాలయ గిరి శృంగములు ,  మానస సరోవర ప్రాంతం ,. ప్రశాంత ప్రకృతి  లో , పరమ రమణీయ ప్రదేశము లో .....  హిమవంతుడు , మేనక   ….  హిమవంతుడు అచంచల తపోదీక్షలో  ఉన్నాడు . ఆయన సంకల్పం మహోత్కృష్టం . శుభకరం. విశ్వ కల్యాణ కారకం . పరాత్పరుని పుత్రికగా పొందాలన్నది హిమవంతుని అభిమతం . అందులకే సాగుచున్నది నిశ్చల తపం .  హిమవంతుని ధర్మపత్ని మేనక  తపో దీక్షలో సర్వం మరచిన పతికి శుశ్రూషలు చేస్తూ సతిగా  తన కర్తవ్యం  నిర్వహిస్తూంది .   తరుణమాసన్నమైంది . వినీల ‘ప్రభలు’ వెదజల్లే ఓ ‘దివ్య జ్యోతి’  సాకారమయ్యే క్షణం రానే వచ్చింది . అందుకు సంకేతంగా ప్రకృతి లో  ఆణువణువూ  పులకించి పోయింది .