ఓం శరవణ భవ - 2

  • 5.4k
  • 2.8k

  రాక్షస నాయకుడైన మహా సురుని పుత్రిక మాయాదేవి . కారణజన్మురాలు . శుక్రాచార్యుని ప్రియ  శిష్యురాలు .  అపూర్వ లావణ్య శోభిత మాయాదేవి . అసమాన ప్రజ్ఞాధురందరి .  రాక్షస జాతి సముద్ధరణ కై కంకణం కట్టుకున్న ఈ  కారణజన్మురాలు గురువు ఆనతి మేరకు కశ్యప ప్రజాపతి ని ఆశ్రయిస్తుంది.   దైత్య కులవర్ధనుడైన ఆ మహాపురుషుని సేవించి , అయన సంపర్కము చే అసమాన బాల సంపన్నులు , అసహాయ శూరులు అయిన  సోదర త్రయమునకు తల్లి అవుతుంది . సహస్రాధికమైన రాక్షస వీరుల జన్మకు కారణమవుతుంది .             శూరపద్ముడు ,సింహ ముఖుడు, తారకాసురుడు   తల్లిదండ్రులైన మాయాదేవి, కశ్యప ప్రజాపతులకు ప్రణమిల్లి మాతృవాక్య పరిపాలకులై ఘోర తపము చేయ తరలి వెళ్లి పోతారు .            శివ ధిక్కార పాపము  దక్ష ప్రజాపతి నే కాదు దేవతలను కూడా  కష్టాల పాలు చేస్తుంది . సాధ్యాసాధ్యములను విశ్లేషించక దక్షుని ప్రాభవ