విద్యాదరి రాజస్తాన్ నుండి హైదరాబాద్ వచ్చిందని తెలియగానే ఆమె తల్లితండ్రులు ,చెల్లెళ్ళు ఆమెను చూసేందుకు వచ్చారు. విద్యా వారితో కలిసి గ్రామానికి బయలుదేరింది. పుట్టిన ఊరు తల్లిలాంటిది. ఆ ఒడిలో లభించే ప్రశాంతత , ప్రేమ ఓ మధురానుభూతి . ఊరిలో అడుగు పెట్టిన మరుక్షణం ఆమె మనసు తేలికైంది. తల్లి ఆదరణ , తండ్రి వాత్సల్యం, చెల్లెళ్ళ స్నేహానురాగాలు----విద్యాధరి కి రోజులు క్షణా ల్లా దొర్లిపోతున్నాయి . కూతురు చెప్పిన విషయాలు సాంతం విన్నాక మాధవరావుకు అఘోరి గుర్తుకు వచ్చాడు . అతడు చెప్పిన భవిష్యవాణి ఇంతవరకు జరిగింది ‘ ప్రారంభం’. కాదు కదా అనిపించింది . ! కాస్త భయం వేసింది . కానీ----తన అనుమానం కూతురుకు చెప్పలేదు . ఇదే సందేహం , భయం విద్యా లో కూడా ఉంది . తండ్రి లాగానే తనూ బయట పడలేదు . ఒకరోజు సాయంత్రం విద్యాధరి గుడికి వెళ్ళింది