నీడ నిజం - 17

  • 3.6k
  • 1
  • 1.8k

విద్యాదరి సుదీర్ఘ కధనం ముగిసింది. చివరి సంఘటన లో ప్రభావం ఆమె ముఖం పై స్పష్టం గా కనబడుతోంది . బంగారు ఛాయలో మెరిసే ఆమె ముఖం లో అరుణ వర్ణం . విద్యాధరి తీవ్రమైన మానసిక సంఘర్షణ కు , ఉద్రేకానికి లోనవుతున్నట్లు ప్రొఫెసర్ భరత్ రామ్ గమనించాడు . “ కూల్ డౌన్ “ ఆమె వెన్ను తట్టి అనునయించాడు . తండ్రి లాంటి భరత్ రామ్ అరచేతిని విద్యాధరి ఆర్తిగా చెంపకు ఆనించుకుని కళ్ళు మూసుకుంది . ఆమె కళ్ళు స్రవిస్తున్నాయి . భరత్ రామ్ కు ఆ క్షణాలు ఎంతో పవిత్రం గా అనిపించాయి . గతం లోంచి వర్తమానం లోకి ఆమె పూర్తిగా రాలేక పోతోంది . ఇంకా ఏవో జ్ఞాపకాల శకలాలు మనసు పొరల్లో ఉండిపోయి ఆమెను కదిలిస్తున్నాయి . ఇంకా ఏదో చెప్పాలన్న తహ తహ ఆమె కళ్ళల్లో స్పష్టం గా