ఆ ముగ్గురు - 48 ( 35 -36 మధ్య కథ)

  • 3.9k
  • 1.5k

ఆదిత్య వ్యూహమే విహారిది కూడా. లేబర్ కాలనీలు జల్లెడ పట్టాడు. నాలుగు రోజుల నిరంతర శ్రమతో చివరకు అన్వర్ అడ్రస్ తెలుసుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా మఫ్టీలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ సమతా సదన్ చుట్టూ " పొజిషన్" లో ఉంచి సుఖదేవ్ ను కలిశాడు. అన్వర్ ( అనంత్ రామ్) స్నేహితుడనని పరిచయం చేసుకున్నాడు. అతడిని కలవాలి అన్నాడు." అనంత్ ను చూసి మూడు రోజులు అయింది. ఇప్పటి వరకు రాలేదు. బహుశా వాళ్ళ ఊరు వెళ్ళాడేమో. కానీ... ఎప్పుడు ఊరు వెళ్ళినా నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు.ఈసారే కాల్ రాలేదు. అదే నాకర్థం కావడం లేదు." సర్దా