నీడ నిజం - 12

  • 2.5k
  • 1.2k

కాళరాత్రి ఎలాగో గడిచింది . తెల్లవారింది .విక్రం సింహ్ మరణవార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది . జనం తీర్థప్రజ లాగా రాసాగారు . పరగణా మొత్తం కదిలింది . సముద్రం లా పొంగిన జనసముహాలను , సానుభూతి పరులను ఆపటం విక్రం తమ్ముళ్ళకు అసాధ్యమైంది . అన్నగారి అంత్య క్రియలు మరో రోజుకు వాయిదా వేయక తప్పింది కాదు . ఆ రోజు కూడా అరని శోకంతో నే గడిచి పోయింది . ఏది ఆగినా ఆగక పోయినా కాలం ఆగదు . సూర్యుడు పడమటి కొండల పై అలసట గా నిట్టూర్చాడు . ఊరి పై చీకటి మెల్ల మెల్ల గా పరుచు కుంటోంది . విక్రం శవాన్ని అ రోజు ఉదయమే పెద్ద లోగిలి కి తరలించారు . శవాన్ని ప్రత్యేకమైన తైలాలతో భద్రపరచారు . పూలవాసన తో , అగరుధూపం తో శవాన్ని ఉంచిన ప్రదేశం