నీడ నిజం - 10

  • 4.2k
  • 2k

ఈ విషయం పనివారి ద్వారా విక్రమ్ తల్లి కి తెలిసింది.ఆమెకు కొడుకు-కోడలి అవస్థ అర్థ మైంది.పర్వం పేరు తోనో,పండుగ పేరుతో నో రాహుల్ ను కొంతకాలం వారిద్దరి కీ దూరంగా వుంచాలనుకుంది. అందుకు దైవికంగా అవకాశం వచ్చింది. రాహుల్ ను ఎలాగో ఒప్పించి, ఆ పసివాడిని తీసికొని పక్క వూరికి ప్రయాణమైంది.మొదట రానని మొరాయించాడు. కాని నాయనమ్మ మాటల గారడీ కి పడి పోయాడు. పైగా అప్పుడు వేసవి శెలవులు. స్కూల్ బెడద కూడా లేదు.రాహుల్ కూడా హాలిడే మూడ్ లో వుండటంతో ఆమె పని సులువైంది. తల్లి సమయస్ఫూర్తి కి విక్రమ్ మనసులో నవ్వుకొన్నాడు. కోమల కూడా మనసులో నే కృతజ్ఞతలు చెప్పుకుంది. కోరినంత ఏకాంతం . కోమలా విక్రమ్ సింగ్ ల ను శారీరకంగా ఒకటి చేసింది. అంకిత భావం, ఆర్ద్రత, అనురాగం త్రివేణీ సంగమమై కోమల రూపంలో విక్రమ్ ను వరదలా ముంచెత్తాయి. ఇలా రోజులు క్షణాల్లా