ఆ ముగ్గురు - 46

  • 2.2k
  • 795

" ఇంతియాజ్ ! ఆదిత్య తమ్ముడు గమనించక పోతే పవన్ పరిస్థితి ఏమిటీ ? ఎంతో పద్ధతి గా, క్రమశిక్షణ తో పెరిగిన పవన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడంటే? మరి పేరెంట్స్ మానిటరింగ్ లేని పిల్లల సంగతి ఏంటి ? తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే కదా విశాల్ బలైంది. .మనలో మార్పు రావాలి, ఇంతియాజ్ ! ది" పరాంకుశరావు మాటల్లో బాధ, పశ్చాత్తాపం. " అరవింద్ - పవన్ కు ఉన్న ఇంటిమసీ, అరవింద్ -విశాల్ కు లేదు. పవన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడంటే కారణం.. స్వేచ్ఛ.డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనే కుతూహలం. క్యూరియాసిటి. విశాల్ పరిస్థితి వేరు. ఒంటరితనం, తల్లిదండ్రుల ఆత్మీయత, శ్రద్ధ లోపించటం. విశాల్ ను డ్రగ్ అడిక్ట్ ను చేశాయి. అందుకే అరవింద్ అతడిని కదిలించలేకపోయాడు.Moreover the fate has already written his destiny. " అవునన్నట్లు తల వూపాడు పరాంకుశరావు.