ఆ ముగ్గురు - 37

  • 4.2k
  • 1.5k

మూడు గంటలకు సర్దార్జీ ని విహారి కలిశాడు. అయిదు నిమిషాల్లో వారి సంభాషణ ముగిసింది. మూడున్నరకు ఆదిత్య సర్దార్జీని కలిశాడు. అయిదు వరకు ఇద్దరూ పార్క్ లో ఉన్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళి పోయారు. సర్దార్జీ ని కలిసిన గంట తర్వాత ఇంతియాజ్, విహారి అన్వర్ అన్వేషణ లో భాగంగా ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్నారు. కాస్త రిలాక్స్ అయి ( అనుకున్న ప్రకారం)విహారి అన్వర్ ఆచూకీ పనిలో మునిగి పోయాడు. అదే టైంలో ( ఆరు గంటలకు) ఆదిత్య ఆసుపత్రి కి వచ్చాడు. అన్వర్ ను అటెండ్ అయిన సర్జన్ ను కలిశాడు. " డాక్టర్ ! ఓ రిక్వెస్ట్ ! " తటపటాయిస్తూ అడిగాడు ఆదిత్య. " చెప్పండి " కొన్ని అనుకోని కారణాల వల్ల పేషెంట్ ను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళి పోవాలి "" ఇప్పుడా?" ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు