ఆ ముగ్గురు - 36

  • 3.9k
  • 1.5k

విహారి వెళ్ళిన అరగంట తరువాత ఆదిత్య సుఖదేవ్ ను కలిశాడు. సుఖదేవ్ ప్రశ్నార్థకంగా చూశాడు. " నా పేరు ఆదిత్య" చేతులు జోడించాడు. క్లుప్తంగా అన్వర్ పరిస్థితి వివరించాడు. సర్దార్జీ కంగారు పడిపోయాడు. " ఎంత ప్రమాదం జరిగింది. ? మరి....ఈ విషయం వెంటనే ఎందుకు నాకు చెప్పలేదు.? ఇప్పుడెలా ఉన్నాడు ? "" మీరు కంగారు పడకండి. అతడు కోలుకుంటున్నాడు. తనేమీకు చెప్ప వద్దన్నాడు. ఇలా కంగారు పడతారనే అతడి భయం."" వాడి మొహం. వాడు మా ఆత్మ బంధువు. వాడికింత కష్టమొస్తే ఊరుకుంటామా ? ంం ఆదుకోవటం మా బాధ్యత కాదా ? ఇంతేనా వాడు మమ్మల్ని అర్థం చేసుకున్నది ? " సర్దార్జీ మాటల్లో బాధ , కోపం కలిసిపోయాయి. " క్షణం ఉండండి. మా వాళ్ళందరికీ చెప్పి వస్తాను. అందరం ఒకేసారి హాస్పిటల్ కు వెళ్దాం " సర్దార్జీ లేవబోయాడు. " ఇప్పుడే వద్దు. మీతో