నా ఫిలాసఫీ... - 5

  • 27.6k
  • 1
  • 5.7k

3... సమస్య ఎక్కడి నుండి వస్తుంది ? Part ____3(a) "గాతకాలం యొక్క ప్రభావం నాపై ఏ మాత్రమూ లేదు"సరే!!! మనమెన్నో విషయాల్ని ప్రస్తావించు కున్నాము ...మనము సమస్య అనుకొనే దాని నుండి ప్రారంభించి, ఎన్నో మలుపులు తిరిగి, 'అసలు సమస్య 'ఏమిటో తెలుసుకున్నాము..." మనము బాగాలేము" అన్న భావన మరి" మన పైన మనకు ప్రేమ లేకపోవడం "అనేది మనలో ఉండడమే అసలు సమస్య .అని తెలుసుకున్నాము. జీవితంలో ఏదైనా సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా ఈ భావనలోంచి ఉత్పన్నమవుతుంది .ఇప్పుడు ఈ ఆలోచన విధానాలు ఎక్కడి నడి వచ్చాయో చర్చిద్దాం....తమ గురించి, తమ జీవితం గురించి, పరిపూర్ణంగా తెలిసిన చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి నిరంతరము సమస్యలతో సుతమతమవుతూ తాము అనర్హులమని, తాము ప్రేమించబడమని, భావించే పెద్దలుగా ఎలా ఎదిగామో కదా? అనర్హులమనే భావన, తాము ప్రేమించబడము ,అనే భావనలు అందరిలోనూ ఏదో తీవ్రతల్లో ఉంటాయి.