అన్నెలీస్ మిషెల్ ట్రాజెడీ మిస్టరీ.....

  • 53.3k
  • 2
  • 18.5k

దేవుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం గురించి వింటూనే ఉన్నాం.... నమ్ముతూనే ఉన్నాం....ఆ వినికిడి, సారాంశం, నమ్మకపు దెయ్యాలు క్రూరమైనవి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి, వాటికి దేవుడంటే భయం అని , కానీ....దైవ శక్తికి సైతం లొంగని ఆరుప్రేతాత్మలు ఆరేళ్లపాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి , అనుక్షణం నరకయాతన పెట్టాయి.....చివరికి క్రూరంగా చంపేశాయి...... 2005లో ప్రపంచాన్ని వనికించినది " ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ "అనే సినిమా కల్పిత కథ కాదు....1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ..... జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన అన్నెలీస్ మిషెల్ కన్నీటి గాథ నేటికీ ఓ మిస్టరీనే.....ఉన్నట్టుండి నవ్వడం ,క్రూరంగా చూడటం, ఎంతటి బలవంతుడినైనా ఒంటి చేత్తో నొక్కి పెట్టి కదలకుండా చేయగలగడం, పైకి లేచి చేతులు చాచి వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం, కాళ్లతో పాటు చేతులను ఉపయోగించి మెట్లు దిగడం, మనిషి మొత్తం రకరకాల మెలికలు