ఆ ముగ్గురు - 20 - లక్కవరం శ్రీనివాసరావు

  • 4k
  • 1.5k

" నీకు మెహర్ విషయాలు తెలిశాయి. నాకు ఆపరేషన్ జన్నత్ క్లూ దొరికింది. " ఇంతియాజ్ స్వరంలో ఉద్వేగం, ఉత్సాహం. స్పందనగా విహారి నవ్వాడు. " సర్ ! వాటీజ్ అన్వర్ ఫర్దర్ మూవ్ ?" విహారి ప్రశ్న కు వెంటనే వివరణ ఇవ్వలేదు ఇంతియాజ్. ఆలోచిస్తూ ప్రశాంతంగా కూర్చుండి పోయాడు.అన్వర్ హైదరాబాద్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ మధ్య కాలంలో తన వాళ్ళను కలిశాడో లేదో . ఒకవేళ కలిసినా తన గురించి నిజం చెప్పాడా ? లేక తన ఉనికి కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాడా ?"" అలాంటప్పుడు మెహర్ ని కలిసే విషయంలో ఆచి తూచిఅడుగెయ్యాలి. ఏం మాత్రం తొందరపడినా మన ప్లాన్ మొత్తం మిస్ ఫైర్ అవుతుంది."" ఎక్జాక్ట్లీ ! అంతేకాదు. ఆపరేషన్ జన్నత్ క్లూ ఛేదించడంలో కూడా జాగ్రత్తగా అడుగు వేయాలి.వారు నడిపేది భయంకరమైన డ్రగ్స్ రాకెట్. మతం ఇచ్చిన మార్ఫియా మత్తు మనిషిని