Love, Life and Vitamin M - 3

  • 9.1k
  • 1
  • 3.4k

ఐదో కథ : సామూహిక ఏకాంతం! ఒకతనికి ఉరిశిక్ష పడింది. "నీ చివరి కోరిక ఏంటి? అని అడిగాడు జడ్జి. "నన్ను ఉరితీస్తున్నట్లు నా వాట్సప్ స్టేటస్ అప్డేట్ చేయాలి" సమాధానం ఇచ్చాడు అతడు. ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిది. ఆంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. డాక్టర్ పరీక్షించి కండీషన్ చాలా సీరియస్ గా ఉంది” అని చెప్పాడు. “మీ వాళ్ళకు ఏమైనా చెప్పాలా?" అని అడిగింది నర్స్. "ఒక వేళ నేను చనిపోతే నా మొహం పైన వెంటనే గుడ్డ కప్పేయండి. లేదంటే మా ఫ్రెండ్స్ ఫోటో తీసి ఇన్స్టా గ్రాంలో పెడతారు” సమాధానం ఇచ్చింది ఆ అమ్మాయి. వర్తమాన కాలంలో ఇవి కాస్త “అతి”శయోక్తులే కావొచ్చు. అలా అనిపించడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కానీ, రేపటి కాలంలో అతిశయోక్తులు కావు. . అతి దగ్గరి వాస్తవాలు. "ఫోన్ పక్కనపెట్టి కిందికి వచ్చెయ్ కలిసి భోజనం చేద్దాం"