Love, Life and Vitamin M - 1

  • 12.5k
  • 4.6k

Love, Life and Vitamin M ప్రేమ, జీవితం మరియు ఎం విటవిన్. M అంటే ఇక్కడ మోర్.. అంటే ఒక్కటి కాదు మరిన్ని. మరెన్నో. ఎం ఫర్ మనీ, ఎం ఫర్ మ్యానర్, ఎం ఫర్ మోటివేషన్, మేనేజ్మెంట్, మ్యాజిక్, మిరాకిల్.. ఇలా మోర్. మోర్ దాన్ మోర్.. అంశాలు. ఈ అంశాల చుట్టూ అల్లిన కథలు. అల్లుకున్న చిన్ని కథలు. చిన్న కథలు. చిన్న చిన్న కథలు. చిన్నవి అంటే చాలా చిన్నవి. షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా.. అలా అన్నమాట. షార్ట్ ఈజ్ స్వీట్ కూడా కదా.. అందుకు అన్నమాట. ఎప్పుడో రాసుకున్నవి. ఎప్పుడూ రాసుకునేవి. ఇప్పుడూ రాస్తున్నవి. కవ్వించేవి. లవ్వించేవి. నవ్వించేవి. కదిలించేవి. ఇప్పుడు పనికొచ్చేవి. ఎప్పుడూ గురుతుకు వచ్చేవి. . ఎప్పటికీ మరిచి పోలేనివి. . “మాతృభారతి” ద్వారా మీతో పంచుకునే అవకాశం.. ఒక అదృష్టం. ఆదరిస్తారని, అభిమానిస్తారని.. అభిప్రాయం తెలియజేస్తారని.. ఆశిస్తూ..