ఆ ముగ్గురు - 11

  • 6.7k
  • 2.6k

ఏ.సి.పీ ఇంతియాజ్ కారు ఓ విశాల భవనం ముందు ఆగింది . మెయిన్ గేటు గోడ మీద " పరాంకుశరావు " అనే అక్షరాలు బ్లాక్ గ్రానైట్ ప్లేట్ మీద బంగారు రంగులో మెరిసిపోతున్నాయి . గేటు ముందు సెక్యూరిటీ సిబ్బంది పహారా బలంగా ఉంది . పరాంకుశరావు ఆ రాష్ట్ర హోం మినిస్టర్ . " గుడ్ ఈవినింగ్ సార్ " ఇంతియాజ్ విష్ చేశారు . ఏదో ఫైలు చూస్తున్న పరాంకుశరావు తలెత్తి చూశాడు . " హలో ఇంతియాజ్ ! హౌ ఆర్ యూ ?" చిరునవ్వు తో పలకరించాడు పరాంకుశరావు . " ఫైన్ సార్ ! " ఎదురుగా కూర్చున్నాడు ఇంతియాజ్ . ఆ విశాలమైన , ఖరీదైన గదిలో అన్నీ పొందికగా అమరి ఉన్నాయి . ఏ. సి చల్లదనం హాయిగా ఉంది . " ఈ మధ్య నువ్వు మన ఊరికి వెళ్ళావా ?" ఫైలు మూసి వెనక్కు వాలుతూ