ఆ ముగ్గురు - 10

  • 7.3k
  • 2.9k

" సాగర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ " ఆ అడ్మిన్ బ్లాక్ పైన సైన్ బోర్డ్ మెరిసి పోతోంది . ఉదయం తొమ్మిది గంటల సమయం . క్యాంపస్ , క్యారిడార్స్ , స్టూడెంట్స్ తో , ఫ్యాకల్టీ మెంబెర్స్ తో సందడిగా ఉన్నాయి . అప్పుడే ఓ ఎన్ ఫీల్డ్ బైక్ రిథమిక్ బీట్ తో స్కూటర్ స్టాండ్ లో వచ్చి ఆగింది . ఓం వ్యక్తి , మరీ ఆజానుబాహుడు కాదు . కాని ఎత్తుగా , హుందాగా ఉన్నాడు. బైక్ దిగి రిమ్ లెస్ గ్లాసెస్ మధ్య వేలితో సున్నితం గా సవరించుకొని ప్రిన్సిపాల్ ఛాంబర్ వైపు అడుగులు వేశాడు . నడకలో ఠీవి , ప్రతి అడుగు లో ఆత్మ విశ్వాసం..... మొదటి చూపులోనే ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలడు . " మే ఐ కమిన్ సార్ ?" ఏదో ఫైల్స్ చూస్తున్న ప్రిన్సిపాల్