ఆ ముగ్గురు - 7

  • 6.2k
  • 2.4k

అన్వర్ రాడార్ పరిధిలో కి రాకపోవడం నిజంగా ఓ అద్భుతం ! ఊహించని టర్నింగ్ పాయింట్ . " అతడు నిలుచుంది కొండవాలు చివర సర్ . పైగా మంచుపడుతోంది . సీక్రెట్ కెమెరా గురి తప్పించుకోవడానికి ఈ రెండూ కారణాలు కావచ్చు . ఏదైమైనా అన్వర్ భాయ్ అదృష్టవంతుడు . చావు తప్పించుకున్నాడు . మనకు, తెలంగాణా ఇంటెలిజెన్స్ వింగ్ కు చేతి నిండా పని కల్పించాడు . రావ్ మాటలకు నవ్వాడు జూనియర్ . " స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్ లో ఇంతియాజ్ అనే ఏ.సి.పి స్థాయి ఆఫీసర్ ఉన్నాడు . కౌంటర్ మిలిటెంట్ ఆపరేషన్స్ నిర్వహించటంలో ట్రైనింగ్ తీసుకున్నాడు . డిపార్ట్మెంట్ తరపున మన మెసేజ్ అతడే రిసీవ్ చేసుకుంటాడు . వెల్ ట్రైన్స్, డ్యూటీ మైండెడ్ అండ్ వెరీ డైనమిక్ . " అన్వర్ సెర్చ్" అతడి పర్వ్యూ లోకే రావచ్చు. నేను రెకమెండ్ చేస్తాను