ఆ ముగ్గురు - 6

  • 7.2k
  • 3k

" గుడ్ మార్నింగ్ అలీ ! " " గుడ్ మార్నింగ్ సర్ ! " అలీ సర్దుకుని నిటారుగా కూర్చున్నాడు. " ఫీల్ ఫ్రీ " అని భుజం తట్టి ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.అలీ చెప్పేది రికార్డు చేసేందుకు ప్రక్కనే ఉన్న కుర్చీలో ఉన్న జూనియర్ ఆఫీసర్, తలుపు దగ్గర సాయుధుడైన సెక్యూరిటీ, పరిస్థితి అర్థ మయింది అలీకి. తను అందుకు సిద్ధంగా ఉన్నాడు. " వెంట్రుక వాసిలో చావు తప్పించుకోవడం కేవలం నీ అదృష్టం. నీ ఆలోచన, జీవించే పద్దతి మార్చుకోవడానికి ఇదొక అవకాశం. మాతో సహకరించి, మాకు కావల్సిన సమాచారం ఏదీ దాచకుండా పూర్తిగా చెబితే నీకు అన్ని విధాలా మంచిది." అలీ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు రావ్. " తప్పకుండా ! మీరు నా ప్రాణం కాపాడారు. మీకు సహకరించటం నా ధర్మం." " వెరీ గుడ్. దట్ ఈజ్ ఎ గుడ్ గెశ్చర్." రావ్ ముఖంలో ప్రసన్నత.అలీ