ఆ ముగ్గురు - 5

  • 5.8k
  • 1
  • 2.4k

ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు సాయంత్రం అలీకి స్పృహ వచ్చింది. మెడ దగ్గర సూదులు గుచ్చినట్లు భరించలేనట్లు బాధ . ఒక్క క్షణం ఆ రాత్రి ని తలచుకున్నాడు. నీడలా వెంటాడే పీడకల . ఒళ్ళు జలదరించింది." హౌ ఆర్ యూ ఫీలింగ్ ?" స్వరం గంభీరంగా ఉన్నా మాటల్లో మెత్తదనం. కళ్ళు తెరిచాడు అలీ. బెడ్ పక్కన నిలుచున్న ఓ సీనియర్ ఆఫీసర్, ప్రశాంత మైన చూపులు.చిరునవ్వు. వయసుతో , అనుభవం తో నిండిన ఫలిత కేశాలు-- నిండైన రూపం.బాగుందంటూ నెమ్మదిగా తల వూపాడు అలీ." నౌ యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. బాగా రెస్ట్ తీసుకో. భయపడకు. నీ బాధ్యత పూర్తిగా మాదే." భుజం తట్టాడు ఆఫీసర్.ఆ పొడవాటి కారిడార్ లో చకచకా నడుస్తున్న ఆఫీసర్ తో ఇద్దరు జూనియర్స్ పరుగులాంటి నడకతో ఆఫీసర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారు." అగ్రెసివ్ గా లేడు. పాజిటివ్ ఆటిట్యూడ్ కనపడుతోంది