ఆ ముగ్గురు - 2

  • 10.4k
  • 5.7k

జమ్మూ కు అవతలి P O K లో ఆ మట్టి రోడ్లో ఓ ట్రక్కు ఆగింది. భారత్ --పాక్ సరిహద్దు కు అతి సమీపంలో ఉన్నఓ కుగ్రామం ఆనుకునే ఆ రోడ్డు వుంది. అన్వర్ తో ఆ నలుగురు దిగారు. " జాగ్రత్త ! All the best." ఆ రెండు ముక్కలు అని ట్రక్కు డ్రైవర్ బండి రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ క్షణం వారిసాహస యాత్ర ప్రారంభం అయింది. అక్కడ నుండి చిట్టడవి, కొండల వరుస ఆరంభం అవుతాయి. అన్వర్ జేబులోంచి రూట్ మ్యాప్ తీశాడు. ఓ నిమిషం మ్యాప్ ను పరిశీలించాడు. ఆ కొండ వైపే మన ప్రయాణం." చూపుడు వేలితో ఓ కొండ ను చూపిస్తూ ముందుకు అడుగులు వేశాడు.