అంతర్మధనం

  • 11.9k
  • 3.1k

అమ్మ దగ్గరకు బయలు దేరిన కమల తన కిష్టమైన, కిటికీ పక్కన సీట్లో కూర్చుని బయటకు చూస్తూంది. ఇంతలోరైలు కదిలింది. "ఎన్నాళ్ళ కు మళ్ళీ రైలెక్కి వెళుతున్నాను. "అనుకుంటూ " ఆంటీ " అన్న పిలుపు కు తల తిప్పి చూసిందిచిన్న బాబుతో పాటు వచ్చి, "జరుగుతారా?" అని ఎదురు గా కూర్చున్న ఆమె ను ఓ అమ్మాయి అడుగుతోంది.కంపార్ట్మెంట్ అంతా ఆ అమ్మాయి, వాళ్ళ బాబు మాటలతో సందడిగా వుంది. బాగా కలిసి పోతుంది అందరితో అనిఅనుకుంటూ ఉన్నారు. మాట కలుపుతూ " మీరేం చేస్తుంటారు ? " అడిగాడు సురేష్.నవ్వుతూ " టీచర్ " ,మరి మీరు ? ఒకే గూటి పక్షులం. మ