3. నిర్ణయం – మరపు ఐదుగురు కలిసి పార్కుకి వచ్చారు. వాళ్ళ ఇద్దరిని మాట్లాడుకోమని స్నేహ,ప్రియా,ప్రభు ముగ్గురు పక్కకి వెళ్లిపోయారు. ప్రణయ్ కోపంతో ప్రీతీ ని అడిగాడు కలవటానికి ఎందుకురాలేదు నేను చాలసేపు ఎదురుచూసి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు ప్రీతీ నాకు ఇష్టంలేదు నేను రాలేదు అనింది. ప్రణయ్ కి కోపం వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏం అయింది ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఓహో స్కూల్ లో ఉన్నప్పుడు ప్రేమించి ఇప్పుడు అవసరం అయ్యిపోయిందిగా వదిలేద్దాం అని అనుకుంటున్నావా అంటాడు. ఆ మాటలు వినగానే ప్రీతికి బాగా ఏడుపు వచ్చి ఏడ్చేస్తుంది. ఏడుస్తూనే ప్రణయ్ కి సమాధానం చెప్తుంది అవును నువ్వు అంటే నాకు ఇష్టంలేదు నీ పనులు నాకు నచ్చట్లేదు దయచేసి నా జోలికి రాకు. ఈ క్షణం నుంచి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు నీకు నాకు