నా జీవిత పయనం - 1

(19)
  • 43k
  • 1
  • 26.4k

నా జీవిత పయనం (ఒక సాధారణ అమ్మాయి కలల పరుగు) ప్రీతీ పేరులాగే అమ్మాయి కూడా అందరితో ప్రేమగా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. తనకి గొడవలన్న అరుచుకోవడాలన్న చాలా భయం. ఎవరైనా కన్నెర్ర చేస్తేనే ఏడ్చేస్తుంది. అటువంటి అమ్మాయి జీవితంలో తన కలలను ఎలా సాధించగలుగుతుంది ? CHAPTER Ⅰ మొదటి కష్టాలు - మొదటి ప్రేమ ప్రీతీది ఒక మధ్యతరగతి కుటుంబం ఇష్టంలేకుండా పెళ్లి చేసుకున్న అమ్మ నాన్న, అమాయకపు తమ్ముడు, ప్రేమగా చూసుకొనే అమ్మమ్మా. వీళ్ళే ప్రీతీ చిన్న ప్రపంచం. కానీ తనకు తెలియదు ఆ ప్రపంచం నవ్వుల ప్రపంచం కాదు అని తన అనుకున్న వారే తనని ఏడిపిస్తారని. వాళ్ళ అమ్మ నాన్నది ఇష్టంలేని పెళ్లి కావటం తో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలే ప్రతి చిన్నదానికి అరుచుకోడాలే చిన్న వయసులో తనకి తెలిసేది కాదు ఎందుకు ఇలా జెరుగుతుందో