తప్పటడుగులు

  • 19.7k
  • 4.4k

"కూర్చోవచ్చా?" ఆ ఆద్ర స్వరం రవివర్మని ఈలోకం లోకి పిలిచింది. "ఎంత ఆపినా ఆగలేదు సార్." ఆ మాటలో బార్ బోయ్ అసహాయత వెలువడింది. "ఓనర్ గారి ప్రైవేట్ ప్లేసని మొత్తుకున్నా సార్." ఆ ఆవడిలో అతని సాక్ష్య వీక్షణ తృష్ణ వెన్నాడింది. "అక్షరాలా నిజం," ఆగంతుడిలో అదే అద్రత. "సరే నువ్వెళ్లు," రవిని వెనువీడని అసహనం. "నాపేరు హరిప్రసాద్, హరి అంటారు." "గేట్ క్రాషర్ అంటే సరిపోతుంది." "క్షమించండి, ఇంత ఇబ్బందనుకోలేదు." "సరే, కూర్చోండి, అనుభవిద్ద్రుగాని." "అంటే?" "నా ఏడాది పాటి ఒంటరితనపు బరువు మీచేత మోయిస్తా." "భలేవారే!" "అయినా ఎందుకీ మొండితనం?" "నచ్చింది పొందడానికి." "ఇంటరెస్టింగ్, ఏమిటి ఇక్కడ నచ్చింది?" "ఏంబియన్స్." "యు గాట్ ఇట్, వెల్కమ్." "థాంక్స్, కాస్త స్టీవార్డ్ని పిలుస్తారా, బోయిని ఎలాగూ బెంబేలు చేసేరు." "చూస్తే మాటకారిలా వున్నారు." రవి సైగ చయ్యడం, స్టీవార్డ్ హాజరవడం, హరి 'ఓల్డ్ మాంక్' లార్జ్ విత్ థమ్స్ప్అప్