బంగారు పంజరం

  • 18.4k
  • 1
  • 4.9k

బంగారు పంజరం " ఏంటే నోరు లేస్తోంది ఎక్కువ మాట్లాడావ్ అనుకో పళ్ళు రాలగొడతా జాగ్రత్త" అంటూ అరుస్తోంది మా అత్తగారు అన్నపూర్ణ "ఎందుకు లేవదు నోరు అ పొగరుబోతు దగ్గరికి వెళ్లి వెళ్ళొచ్చింది గా అక్కడ నీళ్లు వంటపట్టినట్టున్నాయ్ బాగా " అంటూ అగ్నికి అజ్య్o పోస్తోంది మా ఆడపడుచు సుధ " అత్త అసలా ఇపుడు మీరు పెద్దమ్మ ని ఎందుకు అంటున్నారు " లేఖ నా కూతురు మాటలు ఎక్కడ మొదలైన మా అక్క దగ్గరకి రావాల్సిందే పాపం ఈ పిల్ల కి తెలియదు అనుకుని నిట్టూర్చింది గీత "ఏంటే దాన్ని అంటే నీకు పొడుచుకొస్తోంది రోషం" సుధ "అయినా నా ముందు మా అమ్మ ముందే గా మీ మాటలు ఆటలు పెద్దమ్మ ఎదురుగా ఒక్కమాట కూడా