క్షంతవ్యులు - 14

  • 8.1k
  • 1
  • 2.3k

క్షంతవ్యులు – Part 14 చాప్టర్ 33 ఒక నెల ఎడబాటు తర్వాత యశోని తిరిగి కలుసుకున్నాను. మనిషి ఎంతో చిక్కిపోయింది. ముఖం మీద అలసట, నీరసమూ స్పష్టంగా కనబడుతున్నాయి. చలికాలం అది. తను నా వులన్ కోటు పట్టుకుని, కాశ్మిర్ శాలువ కప్పుకున్నా, వణకుతూ, ప్లాటుఫారం మీద నా రాక కై ఎదురు చూస్తూంది. రైలు దిగిన వెంటనే నా కోటు ఇచ్చి వెంటనే తొడుక్కోమంది. టాక్సీలో ఇంటికి వెళ్తున్నాము ఒకరినొకరం హద్దుకు కూచుని. ‘‘జబ్బుపడ్డావా అమ్మీ,’’ అడిగాను తన చేయి తీసుగుని. “లేదే, ఎందుకలా అడుగుతున్నారు?’’ అంది నీరసంగా నవ్వుతూ. ‘‘నీ వాలకం చూస్తే అలానే వుంది,’’ అన్నాను రుగ్దకంఠంతో. ‘‘ఇదంతా విరహం బాదల్ బాబూ. ఇక ఇప్పటి నుంచీ మిమ్మల్ని ఒక్కరినీ ఎక్కడికీ పంపించను. ఎడబాటంటే ఏమిటో తెలిసి వచ్చింది’’ అంది హఠాత్తుగా ఒడిలో తల పెట్టి కళ్లు మూసుకుని. ‘‘నేనెలా అనిపిస్తున్నాను,’’ అన్నాను నా తల త్రిప్పి తన కళ్ళలోకి చూస్తూ ‘‘మీరు